విషాదం..సంతానం కలగడంలేదని ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సూసైడ్

కుమ్రంభీ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది.

By Knakam Karthik
Published on : 31 Aug 2025 7:26 AM IST

Crime News, Telangana, Kumram Bheem Asifabad District, Kagaznagar, Suicide, Teacher dies

విషాదం..సంతానం కలగడంలేదని ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సూసైడ్

కుమ్రంభీ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. సంతానం కలగడం లేదనే మనస్థాపంతో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకుని మరణించింది. కౌటాల మండలంలోని ఒక పాఠశాలలో పనిచేస్తున్న మిడిదొడ్డి కవిత (40) సాయంత్రం 5 గంటల ప్రాంతంలో యెల్లాగౌడ్ తోటలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పిల్లలు లేకపోవడంతో ఆమె చాలా కాలంగా తీవ్ర మనస్తాపానికి గురైనట్లు చెబుతున్నారు. ఆమె భర్త ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నాడు.

కాగజ్ నగర్ కు చెందిన కవిత జిల్లాలోని వివిధ ప్రాంతాలలో సేవలందించారు. బోధన పట్ల ఆమెకున్న నిబద్ధతకు పేరుగాంచారు. ఆమె కవయిత్రి, నృత్యకారిణి కూడా. ఆమె మరణం పట్ల సహోద్యోగులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Next Story