తెలంగాణలో అరుదైన స్కిన్ డొనేషన్
మెదక్‌లోని నర్సాపూర్‌కు చెందిన ఒక కుటుంబం గురువారం బ్రెయిన్‌డెడ్‌గా ప్రకటించిన ఓ వ్యక్తి చర్మాన్ని దానం చేశారు.
By Medi Samrat Published on 21 Sep 2024 3:53 AM GMTమెదక్‌లోని నర్సాపూర్‌కు చెందిన ఒక కుటుంబం గురువారం బ్రెయిన్‌డెడ్‌గా ప్రకటించిన ఓ వ్యక్తి చర్మాన్ని దానం చేశారు. అతని మూత్రపిండాలు, కాలేయం వంటి ఇతర అవయవాలతో పాటు చర్మాన్ని కూడా దానం చేశారు. తెలంగాణ జీవన్ దాన్ కార్యక్రమ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, 2023లో స్కిన్ డొనేషన్ ప్రారంభించినప్పటి నుండి రాష్ట్రంలో నమోదైన మూడవ సంఘటన ఇది. అవయవ దానాల విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. జాతీయ రేటు 0.8% ఉండగా తెలంగాణ 5.4% తో మొదటి స్థానంలో ఉంది.
సెప్టెంబరు 15న సదాశివపేట గ్రామం వద్ద ద్విచక్ర వాహనంపై అదుపు తప్పి ప్రమాదానికి గురయ్యాడు 46 ఏళ్ల వీధి వ్యాపారి బిడిమట్ట మురగేందర్ స్వామి. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయమై చెవి నుంచి రక్తస్రావం అయింది. తొలుత సదాశివపేటలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి, అక్కడి నుంచి ఓజీహెచ్‌కు రిఫర్ చేశారు. అయితే అతని పరిస్థితి క్షీణించింది. వెంటిలేటర్ సపోర్ట్‌పై ఉంచినప్పటికీ, అతను బతకలేదు.
బ్రెయిన్ డెడ్ అయ్యాడని కుటుంబ సభ్యులకు తెలిపారు. ఇంతలో జీవన్ దాన్ సభ్యులు స్వామి కుటుంబ సభ్యులను సంప్రదించారు. అవయవదానం గురించి వివరించారు. అందుకు కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారు. మురగేందర్ స్వామి అవయవాలతో పాటూ చర్మాన్ని కూడా డొనేట్ చేయడానికి కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. చర్మ దానం చాలా అరుదుగా జరుగుతుందని జీవన్ దాన్ అధికారులు తెలిపారు.