Telangana: మంచంపై నుండి కింద పడి 12 ఏళ్ల బాలుడు మృతి

జహీరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ బోర్డింగ్‌ స్కూల్‌లో శనివారం ఉదయం 12 ఏళ్ల విద్యార్థి మంచం మీద నుంచి పడి మృతి చెందాడు.

By అంజి  Published on  3 Nov 2024 10:02 AM IST
student died, private boarding school, Zaheerabad, Telangana

Telangana: మంచంపై నుండి కింద పడి 12 ఏళ్ల బాలుడు మృతి 

జహీరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ బోర్డింగ్‌ స్కూల్‌లో శనివారం ఉదయం 12 ఏళ్ల విద్యార్థి మంచం మీద నుంచి పడి మృతి చెందాడు. సెవెన్త్ డే స్కూల్‌లో 5వ తరగతి చదువుతున్న సాథ్విక్ ఉదయం 7 గంటల సమయంలో మంచం మీద నుంచి కిందకు దిగుతుండగా కిందపడిపోయాడు. అతని ముఖం, అతని తల వెనుక భాగంలో తీవ్రగాయాలు అయ్యాయి.

తోటి విద్యార్థులు పాఠశాల సిబ్బందిని అప్రమత్తం చేయడంతో వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు ఇది ప్రమాదంగా భావిస్తూ ఉన్నారు. స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి. బాలుడి తండ్రి శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న విద్యార్థి తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. కర్ణాటక శివ రాంపూర్ గ్రామానికి చెందిన శ్రీకాంత్ 2వ కుమారుడైన సాత్విక్ రెండు సంవత్సరాలుగా స్థానిక పాఠశాలలో చదువుకుంటున్నాడు.

Next Story