తెలంగాణలో కరోనా కేసులు నిన్నటితో పోలిస్తే కొద్దిగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 925 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ముగ్గురు మృతి చెందినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,62,653 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1426 మంది మృతి చెందారు.
తాజాగా 1,367 మంది కోలుకోగా, ఇప్పటి వరకు 2,49,157 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో మరణాల రేటు 0.54 శాతం ఉండగా, దేశంలో 1.5శాతం ఉంది. ఇక రికవరీ రాష్ట్రంలో 94.86 శాతం ఉండగా, దేశంలో 93.6 శాతం ఉంది. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 12,070 ఉండగా, హోం ఐసోలేషన్‌లో 9,741 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా జీహెచ్‌ఎంసీలో అత్యధికంగా 161 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.