తెలంగాణ‌లో ఈ రోజు కొత్త‌గా ఎన్నికేసులంటే

92 New covid-19 cases reported in Telangana.తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి త‌గ్గుముఖం ప‌ట్టింది. గడిచిన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 March 2022 3:17 PM GMT
తెలంగాణ‌లో ఈ రోజు కొత్త‌గా ఎన్నికేసులంటే

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి త‌గ్గుముఖం ప‌ట్టింది. గడిచిన 24 గంటల్లో నిర్వహించిన 24,812 కరోనా పరీక్షలు చేయగా.. 92 మందికి పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు బుధ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ‌. తాజాగా న‌మోదైన కేసుల‌తో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 7,90,043కి చేరిందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో ఎవ‌రూ క‌రోనాతో మ‌ర‌ణించలేదు.

క‌రోనా మ‌హ‌మ్మారి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య 4,111కు చేరింది. నిన్న 151 మంది కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కూ కోలుకున్న‌వారి సంఖ్య 7,84,616కు చేరాయి. రిక‌వ‌రీ రేటు 99.31 శాతంగా న‌మోదైంది. ఇక‌ ప్రస్తుతం రాష్ట్రంలో 1,316 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు ఆరోగ్య శాఖ రాష్ట్రంలో 3,37,64,136 కొవిడ్ -19 పరీక్షలను నిర్వహించింది.

Next Story