తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,09,802 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 917 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 6,23,510కి చేరినట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ బుధవారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. నిన్న ఒక్క రోజే 10 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి.. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,661కి పెరిగింది. నిన్న 1,006 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 6,06,461కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 13,388 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 108 కేసులు, ఖమ్మంలో 58 కేసులు నమోదు అయ్యాయి.