తెలంగాణ క‌రోనా అప్‌డేట్‌.. కొత్తగా ఎన్నికేసులంటే

91 New covid-19 cases reported in Telangana.తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి. గడిచిన 24 గంటల్లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 March 2022 9:25 PM IST
తెలంగాణ క‌రోనా అప్‌డేట్‌.. కొత్తగా ఎన్నికేసులంటే

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి. గడిచిన 24 గంటల్లో నిర్వహించిన 22,966 కరోనా పరీక్షలు చేయగా.. 91 మందికి పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు మంగ‌ళ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ‌. తాజాగా న‌మోదైన కేసుల‌తో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 7,89,951కి చేరిందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో ఎవ‌రూ క‌రోనాతో మ‌ర‌ణించలేదు.

క‌రోనా మ‌హ‌మ్మారి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య 4,111కు చేరింది. నిన్న 241 మంది కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కూ కోలుకున్న‌వారి సంఖ్య 7,84,465కు చేరాయి. రిక‌వ‌రీ రేటు 99.31 శాతంగా న‌మోదైంది. ఇక‌ ప్రస్తుతం రాష్ట్రంలో 1,375 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు ఆరోగ్య శాఖ రాష్ట్రంలో 3,37,39,324 కొవిడ్ -19 పరీక్షలను నిర్వహించింది.

Next Story