సిద్దిపేట జిల్లాలో దారుణం.. చితి పేర్చుకుని వృద్ధుడి ఆత్మహత్య

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో చోటుచేసుకున్న ఘటన అందరి హృదయాలను కలిచివేస్తోంది.

By అంజి  Published on  5 May 2023 11:15 AM IST
suicide, Siddipet, Telangana, Crime news

సిద్దిపేట జిల్లాలో దారుణం.. చితి పేర్చుకుని వృద్ధుడి ఆత్మహత్య 

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో చోటుచేసుకున్న ఘటన అందరి హృదయాలను కలిచివేస్తోంది. మానవతావాదులను కంటతడి పెట్టించే ఘటన ఇది. 90 ఏళ్ల వృద్ధుడు తన కుమారులు వంతులవారీగా తనకు ఆహారం ఇవ్వడం జీర్ణించుకోలేక తన చితిని తానే పేర్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన వృద్ధుడు వెంకటయ్యకు నలుగురు కుమారులు, ఒక కుతూరు ఉన్నారు. వెంకటయ్య భార్య గతంలోనే మృతి చెందింది.

వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్న తన కొడుకులకు వెంకటయ్య.. తన నాలుగు ఎకరాల భూమిని సరిసమానంగా పంచాడు. కాలం గడుస్తోంది. వృద్ధాప్య పింఛను తీసుకుని స్వగ్రామంలో ఉంటున్న పెద్ద కుమారుడు కనకయ్య వద్ద వెంకటయ్య ఉండేవాడు. అయితే తండ్రి పోషణ ఒక్కడిదేనా?.. మిగతా వారికి పట్టదా? అన్న విషయంపై ఐదు నెలల క్రితం గ్రామంలో పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగింది. ఈ సందర్భంగా పెద్దలు తండ్రికి నెలకు వంతు చొప్పున చూసుకోవాలని నిర్ణయించారు.పెద్ద కొడుకు దగ్గర ఒక నెల గడిచిన తర్వాత.. ఈనెల 3న నవాబుపేటలో ఉంటున్న మరో కొడుకు వద్దకు వెళ్లాల్సి ఉంది.

దీంతో తన ఊరు, ఊరు వదిలి వెళ్లడం ఇష్టంలేని వెంకయ్య గత మంగళవారం అదే గ్రామంలోని ఓ ప్రజాప్రతినిధి ఇంటికి వెళ్లి తన బాధను వెళ్లగక్కారు. ఆరోజు రాత్రంతా అక్కడే ఉండి మరుసటి రోజు (మే 3) ఉదయం నవాబుపేటలోని మరో కుమారుడి వద్దకు వెళతానని చెప్పి అక్కడి నుంచి బయలుదేరిన వెంకయ్య తన కుమారుడి ఇంటికి చేరుకోలేదు. డుకులు వంతులవారీగా చూసుకోవడాన్ని తట్టుకోలేని వెంకటయ్య.. తాటిచెట్లను ఒకే చోట కుప్పగా పోసి నిప్పంటించుకుని అందులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

గురువారం మధ్యాహ్నం పొట్లపల్లి గ్రామ పరిధిలోని ఎల్లమ్మగుట్టలో మంటల్లో వృద్ధుడి మృతదేహం కనిపించడంతో పోలీసులు సమాచారం అందించారు. మృతదేహం వెంకటయ్యదేనని కుటుంబ సభ్యులు గుర్తించారు. చితికి నిప్పంటించుకుని వెంకయ్య ఆత్మహత్యకు పాల్పడినట్లు ఏఎస్సై మణెమ్మ ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

Next Story