తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 805 పాజిటివ్ కేసులు నమోదు కాగా, నలుగురు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,69,223 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం 1455 మంది మృతి చెందారు. తాజాగా కోలుకున్నవారి సంఖ్య 948 మంది ఉండగా, మొత్తం 2,57,278 మంది కోలుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
ఇక రాష్ట్రంలో మరణాల రేటు 0.54 శాతం ఉండగా, దేశంలో 1.5 శాతం ఉన్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 10,490, హోం ఐసోలేషన్‌లో 8,367 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా గడిచిన 24గంటల్లో జీహెచ్ఎంసీలో అత్యధికంగా 131 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మేడ్చల్ మల్కాజిగిరి 82, రంగారెడ్డి 58 కేసులు నమోదయ్యాయి. ఇతర జిల్లాల్లో పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.