తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,10,141 శాంపిళ్లను పరీక్షించగా.. 772 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ బుధవారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 6,29,054కి చేరింది. నిన్న ఒక్క రోజే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి.. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,710కి పెరిగింది. నిన్న 748 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 6,13,872కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,472 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కోవిడ్ బాధితుల రికవరీ రేటు 97.58 శాతంగా ఉంది.