తెలంగాణలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 81,405 శాంపిళ్లను పరీక్షించగా 748 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 6,20,613కి చేరింది. నిన్న ఒక్క రోజే 8 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి.. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,635కి పెరిగింది. నిన్న 1,492 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 6,02,676కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,302 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 121 కేసులు నమోదు కాగా.. నల్లొండలో 34, సూర్యాపేటలో 44, భద్రాద్రి కొత్తగూడెంలో 42 కేసులు నమోదు అయ్యాయి.