తెలంగాణ క‌రోనా బులిటెన్‌.. మ‌ళ్లీ పెరిగిన కేసులు

696 New Corona Cases Reported In Telangana. తెలంగాణ‌లో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 1,05,797 శాంపిళ్ల‌ను

By Medi Samrat  Published on  12 July 2021 4:21 PM GMT
తెలంగాణ క‌రోనా బులిటెన్‌.. మ‌ళ్లీ పెరిగిన కేసులు

తెలంగాణ‌లో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 1,05,797 శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 696 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ సోమ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 6,32,379కి చేరింది. నిన్న ఒక్క రోజే ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి.. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 3,735కి పెరిగింది. నిన్న858 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 6,18,496కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 10,148 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసుల్లో అత్యధికంగా ఖమ్మంలో 82 నమోదు అయ్యాయి.



Next Story