తెలంగాణ క‌రోనా బులిటెన్‌.. కొత్త‌గా ఎన్ని కేసులంటే..

657 New Corona Cases reported In Telangana. తెలంగాణ‌లో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 1,04,478 శాంపిళ్ల‌ను

By -  Medi Samrat
Published on : 20 July 2021 9:29 PM IST

తెలంగాణ క‌రోనా బులిటెన్‌.. కొత్త‌గా ఎన్ని కేసులంటే..

తెలంగాణ‌లో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 1,04,478 శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 657 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంగ‌ళ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 6,38,030కి చేరింది. నిన్న ఒక్క రోజే ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి.. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 3,766కి పెరిగింది. నిన్న704 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 6,24,477కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 9,787 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసుల్లో అత్యధికంగా ఖమ్మంలో 84 నమోదు అయ్యాయి.



Next Story