తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఒక రోజు కేసులు తగ్గుతూ ఉంటే మరొక రోజు కాస్త పెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 635 పాజిటివ్ కేసులు నమోదు కాగా, నలుగురు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,77,151 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,489 మంది మృతి చెందారు. తాజాగా 565 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు 2,67,992 మంది కోలుకున్నారు.
ఇక రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 7,670 ఉండగా, హోం ఐసోలేషన్లో 5,557 మంది చికిత్స పొందుతున్నారు. ఇక రాష్ట్రంలో మరణాల రేటు 0.53 శాతం ఉండగా, దేశంలో 1.5 శాతం ఉంది. అలాగే రాష్ట్రంలో రికవరీ రేటు 96.69శాతం ఉండగా, దేశంలో 94.9శాతం ఉంది. తాజాగా అత్యధికంగా జీహెచ్ఎంసీలో 141 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.