తెలంగాణలో క‌రోనా బులిటెన్ విడుద‌ల‌.. కొత్త‌గా ఎన్ని కేసులంటే..

631 Corona Cases In Telangana. తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 631 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా

By Medi Samrat  Published on  4 Dec 2020 3:53 AM GMT
తెలంగాణలో క‌రోనా బులిటెన్ విడుద‌ల‌.. కొత్త‌గా ఎన్ని కేసులంటే..

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 631 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇద్ద‌రు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,72,123 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 1467 మంది మృతి చెందారు. తాజాగా కోలుకున్నవారి సంఖ్య 802 మంది ఉండగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,61,830 మంది ఉన్నారు.

మొత్తం యాక్టివ్‌ కేసులు 8,826 ఉండగా, హోం ఐసోలేషన్‌లో 6,817 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా జీహెచ్‌ఎంసీలో 109 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, మల్కాజిగిరి 57, రంగారెడ్డి 49 పాజిటివ్‌ కేసులునమోదయ్యాయి. ఇతర జిల్లాల్లో పదుల సంఖ్యలో కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.


Next Story