తెలంగాణ క‌రోనా బులిటెన్ విడుద‌ల‌.. కొత్త‌గా ఎన్ని కేసులంటే..

627 Corona Cases In Telangana. తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఒక రోజు కేసులు తగ్గుతూ ఉంటే మరొక రోజు కాస్త

By Medi Samrat  Published on  19 Dec 2020 9:23 AM IST
తెలంగాణ క‌రోనా బులిటెన్ విడుద‌ల‌.. కొత్త‌గా ఎన్ని కేసులంటే..

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఒక రోజు కేసులు తగ్గుతూ ఉంటే మరొక రోజు కాస్త పెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 627 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, న‌లుగురు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,80,822 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 1510 మంది మృతి చెందారు. తాజాగా 721 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు 2,72,370 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 6,942 ఉండగా, హోం ఐసోలేషన్‌లో 4,814 మంది చికిత్స పొందుతున్నారు. ఇక రాష్ట్రంలో మరణాల రేటు 0.53 శాతం ఉండగా, దేశంలో 1.5 శాతం ఉంది. అలాగే రాష్ట్రంలో రికవరీ రేటు 96.99శాతం ఉండగా, దేశంలో 95.5 శాతం ఉంది. తాజాగా అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 123 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.




Next Story