తెలంగాణ క‌రోనా బులిటెన్‌.. జీహెచ్ఎంసీలో స్వ‌ల్పంగా పెరిగిన కేసులు

621 New Corona Cases Reported In Telangana. తెలంగాణ‌లో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 1,13,012 శాంపిళ్ల‌ను

By Medi Samrat  Published on  31 July 2021 2:27 PM GMT
తెలంగాణ క‌రోనా బులిటెన్‌.. జీహెచ్ఎంసీలో స్వ‌ల్పంగా పెరిగిన కేసులు

తెలంగాణ‌లో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 1,13,012 శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 621 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ శ‌నివారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 6,44,951కి చేరింది. నిన్న ఒక్క రోజే క‌రోనాతో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి.. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 3,802కి పెరిగింది. నిన్న 691 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 6,32,080కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 9,069 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 80, క‌రీంన‌గ‌ర్‌లో 67, వ‌రంగ‌ల్ అర్బ‌న్‌లో 54 కేసుల చొప్పున‌ నమోదు అయ్యాయి.
Next Story
Share it