తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,11,251 శాంపిళ్లను పరీక్షించగా.. 614 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 6,44,330కి చేరింది. నిన్న ఒక్క రోజే కరోనాతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి.. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,800కి పెరిగింది. నిన్న 657 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 6,31,389కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,141 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 73, కరీంనగర్లో 61, వరంగల్ అర్బన్‌లో 59 కేసుల చొప్పున నమోదు అయ్యాయి.