తెలంగాణలో కరోనా కేసులు నిన్నటితో పోలిస్తే కొద్దిగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 602 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ముగ్గురు మృతి చెందినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,64,128 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1433 మంది మృతి చెందారు. తాజాగా 1,015 మంది కోలుకోగా, ఇప్పటి వరకు 2,51,468 మంది కోలుకున్నారు.
రాష్ట్రంలో మరణాల రేటు 0.54 శాతం ఉండగా, దేశంలో 1.5శాతం ఉంది. ఇక రికవరీ రాష్ట్రంలో 95.20 శాతం ఉండగా, దేశంలో 93.7 శాతం ఉంది. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 11,227 ఉండగా, హోం ఐసోలేషన్‌లో 8,942 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా జీహెచ్‌ఎంసీలో అత్యధికంగా 129 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.