తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,07,329 శాంపిళ్లను పరీక్షించగా.. 582 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ గురువారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 6,47,811కి చేరింది. నిన్న ఒక్క రోజే కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి.. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,817కి పెరిగింది. నిన్న 638 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 6,35,250కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 8,744 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రికవరీ రేటు 98.06 శాతం కాగా.. మరణాల రేటు 0.58 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 83 కేసులు నమోదైనట్లు తెలిపింది.