తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,11,226 శాంపిళ్లను పరీక్షించగా.. 577 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 6,48,388కి చేరింది. నిన్న ఒక్క రోజే కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి.. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,819కి పెరిగింది. నిన్న 645 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 6,35,895కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 8,674 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రికవరీ రేటు 98.07 శాతం కాగా.. మరణాల రేటు 0.58 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 79 కేసులు నమోదైనట్లు తెలిపింది.