తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఒక రోజు కేసులు తగ్గుతూ ఉంటే మరొక రోజు కాస్త పెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 573 పాజిటివ్ కేసులు నమోదు కాగా, నలుగురు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,77,724 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,493 మంది మృతి చెందారు.
తాజాగా 609 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు 2,68,601 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 7,630 ఉండగా, హోం ఐసోలేషన్‌లో 5,546 మంది చికిత్స పొందుతున్నారు. ఇక రాష్ట్రంలో మరణాల రేటు 0.53 శాతం ఉండగా, దేశంలో 1.5 శాతం ఉంది. అలాగే రాష్ట్రంలో రికవరీ రేటు 96.71శాతం ఉండగా, దేశంలో 94.9శాతం ఉంది. తాజాగా అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 127 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.