తెలంగాణ క‌రోనా బులిటెన్ విడుద‌ల‌.. కొత్త‌గా ఎన్ని కేసులంటే..

565 Corona Cases In Telangana. తెలంగాణలో కొత్తగా 565 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఒక‌రు క‌రోనాకు బ‌లయ్యారు.

By Medi Samrat  Published on  2 Dec 2020 9:56 AM IST
తెలంగాణ క‌రోనా బులిటెన్ విడుద‌ల‌.. కొత్త‌గా ఎన్ని కేసులంటే..

తెలంగాణలో కొత్తగా 565 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఒక‌రు క‌రోనాకు బ‌లయ్యారు. గడిచిన 24 గంటల్లో 925 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,60,155 మంది కోలుకున్నారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో (2,70,883 మంది కరోనా బారిన పడగా, మొత్తం 1462 మంది మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇక రాష్ట్రంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 9,266 ఉండగా, హొం ఐసోలేషన్‌లో 7,219 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 555,51,620 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 106 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.


Next Story