తెలంగాణ 10వ తరగతి విద్యార్థులకు మరో గుడ్ న్యూస్.. 50 శాతం ఛాయిస్ ప్రశ్నలతో పరీక్ష

50 per cent choice in questions this year. తెలంగాణలో నిర్వహించబోయే SSC పబ్లిక్ ఎగ్జామినేషన్-2022లో విద్యార్థులకు పెద్ద ఊరట

By Medi Samrat  Published on  18 Feb 2022 4:42 AM GMT
తెలంగాణ 10వ తరగతి విద్యార్థులకు మరో గుడ్ న్యూస్.. 50 శాతం ఛాయిస్ ప్రశ్నలతో పరీక్ష

తెలంగాణలో నిర్వహించబోయే SSC పబ్లిక్ ఎగ్జామినేషన్-2022లో విద్యార్థులకు పెద్ద ఊరట కలిగించే నిర్ణయాన్ని అధికారులు తీసుకున్నారు. వివిధ విభాగాలలో 50 శాతం ప్రశ్నలకు మాత్రమే సమాధానమిచ్చే అవకాశం ఉంటుంది. సిలబస్‌ పూర్తి కాకపోవడం, ఆన్‌లైన్‌ క్లాస్‌లు నిర్వహించడం లాంటి కారణాలతో విద్యాశాఖ 50 శాతం ఛాయిస్ ప్రశ్నలతో పరీక్ష నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. వివిధ విభాగాలలో 50 శాతం ప్రశ్నలకు మాత్రమే సమాధానమిచ్చే అవకాశం ఉంటుంది. ఆబ్జెక్టివ్ పార్ట్‌లోని అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉండగా ఛాయిస్‌ ప్రశ్న పత్రాల థియరీ విభాగాలలో మార్పులు చేశారు అధికారులు. 2022 సంవత్సరం ఎస్‌ఎస్‌సీ పరీక్షలలో ప్రశ్నలలో 50 శాతం ఛాయిస్ ఉంటుంది.

పరీక్షలు మే 11న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ (గ్రూప్ A), ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-I (కాంపోజిట్ కోర్సు), ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-II (కాంపోజిట్ కోర్సు)తో ప్రారంభమవుతాయి. మే 17న సోషల్ స్టడీస్ పేపర్‌తో ముగుస్తాయి. OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్-I (సంస్కృతం & అరబిక్), OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్-II (సంస్కృతం & అరబిక్) మరియు SSC వొకేషనల్ కోర్సు (థియరీ) వరుసగా మే 18, 19 మరియు 20 తేదీల్లో జరుగుతాయి. అన్ని సబ్జెక్టుల్లోని ఆబ్జెక్టివ్ పేపర్‌లకు పరీక్ష చివరి 30 నిమిషాల్లో సమాధానాలు రాయాల్సి ఉంటుంది. మోడల్ ప్రశ్న పత్రాలను స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు. ముందుగా ప్రకటించినట్లుగా ఎస్‌ఎస్‌సీ పరీక్షలు 2022 అన్ని సబ్జెక్టులలో మొత్తం సిలబస్‌లో 70 శాతం మాత్రమే నిర్వహించబడతాయి. సాధారణ 11 పేపర్‌లకు బదులుగా ఆరు పేపర్లు మాత్రమే ఉంటాయి. గత సంవత్సరం దాదాపు 5.16 లక్షల మంది విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించారు. కోవిడ్ మహమ్మారి కారణంగా పరీక్షలు నిర్వహించబడలేదు. విద్యార్థులు వారి ఇంటర్నల్ అసెస్‌మెంట్ మార్కులను పరిగణనలోకి తీసుకుని ఉత్తీర్ణులైనట్లు ప్రకటించారు అధికారులు.

పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 14తో ముగియగా, విద్యార్థులు పరీక్ష రుసుమును రూ. 50 మరియు రూ. 200 ఆలస్య రుసుముతో ఫిబ్రవరి 24 వరకు మరియు మార్చి 4 వరకు చెల్లించవచ్చు. రుసుము కూడా రూ. 500 ఆలస్య రుసుముతో మార్చి 14 వరకు ఆమోదించబడుతుంది. ఇప్పటి వరకు 4.81 లక్షల మంది పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.


Next Story