జగిత్యాల్‌లో కూలీలపై తేనెటీగల దాడి

50 NREGA labourers injured in bee attack in Jagtial. మంగళవారం కొడిమ్యాల్ మండల కేంద్రంలో ఎన్‌ఆర్‌ఇజిఎ(NREGA(ఉపాధి హామీ) కూలీలపై

By Medi Samrat  Published on  9 May 2023 7:15 PM IST
జగిత్యాల్‌లో కూలీలపై తేనెటీగల దాడి

మంగళవారం కొడిమ్యాల్ మండల కేంద్రంలో ఎన్‌ఆర్‌ఇజిఎ(NREGA(ఉపాధి హామీ) కూలీలపై తేనెటీగలు దాడి చేయడంతో 50 మంది కార్మికులు గాయపడ్డారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బూరుగుకుంట సమీపంలోని గుట్టలపై 250 మంది కూలీలు పనిచేస్తున్నారు. ఆ ప్రాంతాన్ని శుభ్రం చేస్తుండగా.. కొంతమంది కార్మికులు తేనెటీగల‌ ఉన్న చెట్టు కొమ్మను తాకారు. దీంతో రెచ్చిపోయిన తేనెటీగలు కూలీలపై దాడి చేశాయి. దాదాపు 50 మంది కూలీలు గాయపడగా, మిగిలిన వారు తప్పించుకోగలిగారు. గాయపడిన కార్మికులందరికీ స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందించారు.


Next Story