తెలంగాణ క‌రోనా అప్‌డేట్‌.. రాష్ట్రంలో 950 యాక్టివ్ కేసులు

50 New covid-19 cases Reported in Telangana.తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో నిర్వహించిన 16,128 కరోనా పరీక్షలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 March 2022 9:38 PM IST
తెలంగాణ క‌రోనా అప్‌డేట్‌.. రాష్ట్రంలో 950 యాక్టివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో నిర్వహించిన 16,128 కరోనా పరీక్షలు చేయగా.. 50 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు ఆదివారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ‌ పేర్కొంది. తాజాగా న‌మోదైన కేసుల‌తో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 7,90,351కి చేరిందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో ఎవ‌రూ క‌రోనాతో ప్రాణాలు కోల్పోలేదు.

క‌రోనా మ‌హ‌మ్మారి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో 4,111 మంది మ‌ర‌ణించారు. నిన్న 164 మంది కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కూ కోలుకున్న‌వారి సంఖ్య 7,85,290కు చేరాయి. రిక‌వ‌రీ రేటు 99.35 శాతంగా న‌మోదైంది. ఇక‌ ప్రస్తుతం రాష్ట్రంలో 950 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు ఆరోగ్య శాఖ రాష్ట్రంలో 3,38,54,302 కొవిడ్ -19 పరీక్షలను నిర్వహించింది.

Next Story