తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 65,607 శాంపిళ్లను పరీక్షించగా.. 465 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ఆదివారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 6,31,683కి చేరింది. నిన్న ఒక్క రోజే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి.. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,729కి పెరిగింది. నిన్న869 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 6,17,638కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,316 యాక్టివ్ కేసులు ఉన్నాయి.