తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 83,763 శాంపిళ్లను పరీక్షించగా.. 455 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ఆదివారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 6,45,406కి చేరింది. నిన్న ఒక్క రోజే కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి.. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,805కి పెరిగింది. నిన్న 648 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 6,32,728కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 8,873 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 77, కరీంనగర్‌లో 35, వరంగల్ అర్బన్‌లో 28 కేసుల చొప్పున నమోదు అయ్యాయి.