తెలంగాణలో కరోనా విజృంభణ.. మళ్లీ పెరిగిన కేసులు
4459 New Corona Cases Reported In Telangana. తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో భారీగా కేసులు మళ్లీ
By Medi Samrat Published on 25 Jan 2022 3:39 PM GMT
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో భారీగా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో నిర్వహించిన 1,13,670 కరోనా పరీక్షలు చేయగా.. 4,459 మందికి కరోనా పాజిటివ్ అని తేలిందని మంగళవారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ. తాజాగా నమోదైన కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 7,43,354కి చేరిందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మృతి చెందగా.. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 4,077కు చేరింది. గడిచిన 24 గంటల్లో 1,961 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకూ కోలుకున్నవారి సంఖ్య 7,03,008కు చేరాయి. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 36,269 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసులలో జీహెచ్ఎంసీలో 1450, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో 432 ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
— IPRDepartment (@IPRTelangana) January 25, 2022
(Dated.25.01.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/x84PwcHL7A