తెలంగాణలో కరోనా విజృంభణ.. భారీగా కేసులు నమోదు

4416 New corona cases reported in telangana. తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో భారీగా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి.

By -  అంజి
Published on : 21 Jan 2022 8:04 PM IST

తెలంగాణలో కరోనా విజృంభణ.. భారీగా కేసులు నమోదు

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో భారీగా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో నిర్వహించిన 1,20,243 కరోనా పరీక్షలు చేయగా.. 4,416 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలిందని శుక్రవారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ‌. తాజాగా న‌మోదైన కేసుల‌తో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 7,26,819కి చేరిందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో క‌రోనాతో ఇద్దరు మృతి చెందగా.. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 4,069కు చేరింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 1,920 మంది కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కూ కోలుకున్న‌వారి సంఖ్య 6,93,623కు చేరాయి. ఇక‌ ప్రస్తుతం రాష్ట్రంలో 29,127 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తాజా కేసుల‌లో జీహెచ్ఎంసీ, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లాల్లో ఎక్కువ‌గా న‌మోద‌వుతున్నాయి.


Next Story