తెలంగాణ క‌రోనా బులిటెన్‌.. టెన్ష‌న్ పెంచుతున్న కేసులు

4393 New Corona Cases reported In Telangana. తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో భారీగా కేసులు

By Medi Samrat  Published on  22 Jan 2022 2:38 PM GMT
తెలంగాణ క‌రోనా బులిటెన్‌.. టెన్ష‌న్ పెంచుతున్న కేసులు

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో భారీగా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో నిర్వహించిన 1,16,224 కరోనా పరీక్షలు చేయగా.. 4,393 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలిందని శ‌నివారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ‌. తాజాగా న‌మోదైన కేసుల‌తో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 7,31,212కి చేరిందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో క‌రోనాతో ఇద్దరు మృతి చెందగా.. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 4,071కు చేరింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 2,319 మంది కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కూ కోలుకున్న‌వారి సంఖ్య 6,95,942కు చేరాయి. ఇక‌ ప్రస్తుతం రాష్ట్రంలో 31,199 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తాజా కేసుల‌లో జీహెచ్ఎంసీ, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లాల్లో ఎక్కువ‌గా న‌మోద‌వుతున్నాయి.




Next Story