తెలంగాణ క‌రోనా బులిటెన్‌.. కొత్త‌గా ఎన్ని కేసులంటే..

434 New Corona Cases Reported In Telangana. తెలంగాణలో గ‌డిచిన‌ 24 గంటల్లో 23,979 క‌రోనా శాంపిల్స్ ప‌రీక్షించ‌గా..

By Medi Samrat  Published on  26 Jun 2022 3:24 PM GMT
తెలంగాణ క‌రోనా బులిటెన్‌.. కొత్త‌గా ఎన్ని కేసులంటే..

తెలంగాణలో గ‌డిచిన‌ 24 గంటల్లో 23,979 క‌రోనా శాంపిల్స్ ప‌రీక్షించ‌గా.. 434 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3,762 కాగా, ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 7,99,055గా ఉంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి)లో గత 24 గంటల్లో అత్యధికంగా 343 కేసులు నమోదయ్యాయి, రంగారెడ్డి (34), మేడ్చల్ మల్కాజిగిరి (25) అత్య‌ధికంగా కేసులు న‌మోద‌య్యాయి. 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 285 మంది కరోనావైరస్ నుండి కోలుకున్నారు, రికవరీ రేటు 99.01%గా ఉంది. ఇప్ప‌టివ‌ర‌కూ మొత్తం 7,91,182 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 23,979 నమూనాలను పరీక్షించారు. 126 స్వాబ్ నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది.







Next Story