తెలంగాణ క‌రోనా బులిటెన్‌.. కొత్త‌గా ఎన్ని కేసులంటే..

420 New Corona Cases Reported In Telangana. తెలంగాణ‌లో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 87,355

By Medi Samrat  Published on  14 Aug 2021 3:23 PM GMT
తెలంగాణ క‌రోనా బులిటెన్‌.. కొత్త‌గా ఎన్ని కేసులంటే..

తెలంగాణ‌లో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 87,355 శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 420 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ శ‌నివారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 6,52,135కి చేరింది. నిన్న ఒక్క రోజే క‌రోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి.. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 3,841కి పెరిగింది. నిన్న 623 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 6,40,688కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 7,606 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రికవరీ రేటు 98.24 శాతం కాగా.. మరణాల రేటు 0.58 శాతంగా ఉన్నట్లు పేర్కొంది.



Next Story