తెలంగాణ క‌రోనా బులిటెన్‌.. కొత్త‌గా ఎన్ని కేసులంటే..

409 New Corona Cases Reported In Telangana. తెలంగాణ‌లో నిన్న‌టితో పోల్చితే క‌రోనా కేసుల సంఖ్య స్వ‌ల్పంగా పెరిగాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో

By Medi Samrat  Published on  19 Aug 2021 2:42 PM GMT
తెలంగాణ క‌రోనా బులిటెన్‌.. కొత్త‌గా ఎన్ని కేసులంటే..

తెలంగాణ‌లో నిన్న‌టితో పోల్చితే క‌రోనా కేసుల సంఖ్య స్వ‌ల్పంగా త‌గ్గాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 88,308 శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 409 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ గురువారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 6,54,035కి చేరింది. నిన్న క‌రోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి.. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 3,852కి పెరిగింది. నిన్న 453 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 6,43,318కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 6,865 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రికవరీ రేటు 98.356శాతం కాగా.. మరణాల రేటు 0.58 శాతంగా ఉన్నట్లు పేర్కొంది.


Next Story