తెలంగాణలో నిన్నటితో పోల్చితే కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో 80,262 శాంపిళ్లను పరీక్షించగా.. 405 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ సోమవారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 6,52,785కి చేరింది. నిన్న కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి.. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,845కి పెరిగింది. నిన్న 577 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 6,41,847కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 7,093 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రికవరీ రేటు 98.32 శాతం కాగా.. మరణాల రేటు 0.58 శాతంగా ఉన్నట్లు పేర్కొంది.