తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో భారీగా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో నిర్వహించిన 97,113 కరోనా పరీక్షలు చేయగా.. 3,980 మందికి కరోనా పాజిటివ్ అని తేలిందని సోమవారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ. తాజాగా నమోదైన కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 7,38,795కి చేరిందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో ముగ్గురు మృతి చెందగా.. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 4,075కు చేరింది. గడిచిన 24 గంటల్లో 2,398 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకూ కోలుకున్నవారి సంఖ్య 7,01,047కు చేరాయి. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 33,673 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసులలో జీహెచ్ఎంసీలో 1439, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో 344 ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి.