తెలంగాణ కరోనా బులిటెన్.. కొత్తగా ఎన్ని కేసులంటే..
3877 New Corona Cases Reported In Telangana. తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో భారీగా కేసులు
By Medi Samrat Published on
28 Jan 2022 3:00 PM GMT

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో భారీగా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో నిర్వహించిన 1,01,812 కరోనా పరీక్షలు చేయగా.. 3,877 మందికి కరోనా పాజిటివ్ అని తేలిందని శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ. తాజాగా నమోదైన కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 7,54,976కి చేరిందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మృతి చెందగా.. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 4,083కు చేరింది. గడిచిన 24 గంటల్లో 2,981 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకూ కోలుకున్నవారి సంఖ్య 7,10,479కు చేరాయి. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 40,414 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసులలో జీహెచ్ఎంసీలో 1189, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో 348 ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి.
Next Story