తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 97,236 శాంపిళ్లను పరీక్షించగా.. 3,527 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 5,71,044కి చేరింది. నిన్న ఒక్క రోజే 19 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి.. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,226కి పెరిగింది.
నిన్న 3,982 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 5,30,025కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 37,793 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 519 కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 92.81 శాతంగా ఉండగా.. మరణాల రేటు 0.56 శాతంగా ఉంది.