3500-year-old menhir found in Mahabubabad district. మహబూబాద్ జిల్లా మరిపెడ మండలం బీచరాజుపల్లి గ్రామం సమీపంలో రోడ్డు పక్కన మెన్హీర్ అని
By Medi Samrat Published on 14 March 2022 11:57 AM GMT
మహబూబాద్ జిల్లా మరిపెడ మండలం బీచరాజుపల్లి గ్రామం సమీపంలో రోడ్డు పక్కన మెన్హీర్ అని కూడా పిలువబడే ఆరు అడుగుల పొడవైన రాయి కనుగొనబడింది. పురావస్తు శాస్త్రవేత్త, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ యొక్క CEO, E శివనాగిరెడ్డి ప్రకారం.. ఈ మెన్హిర్ సుమారు 3,500 సంవత్సరాల నాటిది. పురావస్తు, వారసత్వ అవశేషాల గురించి "ప్రిజర్వ్ హెరిటేజ్ ఫర్ పోస్టరిటీ" కార్యక్రమం కింద ఆదివారం ఆయన సర్వే సందర్భంగా ఈ రాయి కనిపించింది.
"మెన్హిర్ 6 అడుగుల ఎత్తు మరియు 3 అడుగుల వ్యాసం, 3 అడుగుల లోతులో పాతిపెట్టబడింది. చనిపోయిన వ్యక్తి స్మారకార్థం దీన్ని ఏర్పాటు చేశారని డాక్టర్ శివనాగిరెడ్డి తెలిపారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జిఎస్‌ఐ) మాజీ డైరెక్టర్ డాక్టర్ కె మహేందర్ రెడ్డి మాట్లాడుతూ మెన్హిర్ లూకో గ్రానైట్ రాయితో తయారు చేయబడిందని, చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉందని అన్నారు. పురావస్తు ప్రాముఖ్యత ఉన్నందున దీనిని సంరక్షించాలని డాక్టర్ శివనాగిరెడ్డి స్థానికులకు విజ్ఞప్తి చేశారు.
ఆదిమానవులు చనిపోయిన తర్వాత సమాధి చేసే కార్యక్రమానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు. ప్రముఖులెవరైనా చనిపోతే... వారి సమాధి వద్ద స్మృతిచిహ్నంగా భారీ నిలువు రాళ్లను పాతేవారు. ఆ నిలువు రాళ్లనే మెన్హిర్‌గా పేర్కొంటారు. ప్రజలకు వాటిమీద అవగాహన లేకపోవడంతో ఇవి అదృశ్యమయ్యాయి.