తెలంగాణ క‌రోనా బులిటెన్‌.. కొత్త‌గా ఎన్ని కేసులంటే..

3464 New Corona Cases Reported In Telangana. తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 65,997

By Medi Samrat  Published on  21 May 2021 1:51 PM GMT
తెలంగాణ క‌రోనా బులిటెన్‌.. కొత్త‌గా ఎన్ని కేసులంటే..

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 65,997 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 3,464 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 5,47,727కి చేరింది. నిన్న ఒక్క రోజే 25 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 3085కి పెరిగింది.

నిన్న 4801 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 5,00,247కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 44,395 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్త‌గా న‌మోదైన కేసుల్లో అత్య‌ధికంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో 534 కేసులు న‌మోదు అయ్యాయి. రాష్ట్రంలో రిక‌వ‌రీ రేటు 91.33 శాతంగా ఉండ‌గా.. మ‌ర‌ణాల రేటు 0.56 శాతంగా ఉంది.




Next Story