తెలంగాణ క‌రోనా బులిటెన్.. కొత్త‌గా ఎన్ని కేసులంటే..

325 New Corona Cases Reported In Telangana. తెలంగాణ‌లో నిన్న‌టితో పోల్చితే క‌రోనా కేసుల సంఖ్య స్వ‌ల్పంగా త‌గ్గాయి. గ‌డిచిన 24

By Medi Samrat  Published on  28 Aug 2021 2:26 PM GMT
తెలంగాణ క‌రోనా బులిటెన్.. కొత్త‌గా ఎన్ని కేసులంటే..

తెలంగాణ‌లో నిన్న‌టితో పోల్చితే క‌రోనా కేసుల సంఖ్య స్వ‌ల్పంగా త‌గ్గాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 78,787 శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 325 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ శ‌నివారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 6,57,119కి చేరింది. నిన్న క‌రోనాతో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి.. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 3,869కి పెరిగింది. నిన్న 424 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 6,47,185కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 6,065 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రికవరీ రేటు 98.48 శాతం కాగా.. మరణాల రేటు 0.58 శాతంగా ఉన్నట్లు పేర్కొంది.



Next Story