తెలంగాణ కొత్త‌గా 322 క‌రోనా కేసులు.. 3 మ‌ర‌ణాలు

322 New Corona Cases Reported In Telangana. తెలంగాణ‌లో నిన్న‌టితో పోల్చితే క‌రోనా కేసుల సంఖ్య స్వ‌ల్పంగా త‌గ్గాయి. గ‌డిచిన

By -  Medi Samrat
Published on : 1 Sept 2021 7:48 PM IST

తెలంగాణ కొత్త‌గా 322 క‌రోనా కేసులు.. 3 మ‌ర‌ణాలు

తెలంగాణ‌లో నిన్న‌టితో పోల్చితే క‌రోనా కేసుల సంఖ్య స్వ‌ల్పంగా త‌గ్గాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 71,402 శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 322 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ బుధ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 6,58,376కి చేరింది. నిన్న క‌రోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి.. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 3,876కి పెరిగింది. నిన్న 331 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 6,48,648కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 5,852 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రికవరీ రేటు 98.52 శాతం కాగా.. మరణాల రేటు 0.58 శాతంగా ఉన్నట్లు పేర్కొంది.



Next Story