తెలంగాణ క‌రోనా బులిటెన్‌.. కొత్త‌గా ఎన్ని కేసులంటే..

306 New Corona Cases reported In Telangana. తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో

By Medi Samrat  Published on  4 Sep 2021 2:11 PM GMT
తెలంగాణ క‌రోనా బులిటెన్‌.. కొత్త‌గా ఎన్ని కేసులంటే..

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 69,422 శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 306 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ శ‌నివారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 6,59,313కి చేరింది. నిన్న క‌రోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి.. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 3,883కి పెరిగింది. నిన్న 366 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 6,49,757కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 5,673 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రికవరీ రేటు 98.55 శాతం కాగా.. మరణాల రేటు 0.58 శాతంగా ఉన్నట్లు తెలిపింది.


Next Story