తెలంగాణ క‌రోనా బులిటెన్‌.. కొత్త‌గా ఎన్ని కేసులంటే..

2646 New Corona Cases Reported In Telangana. తెలంగాణలో బుధవారం 2,646 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

By Medi Samrat
Published on : 2 Feb 2022 8:47 PM IST

తెలంగాణ క‌రోనా బులిటెన్‌.. కొత్త‌గా ఎన్ని కేసులంటే..

తెలంగాణలో బుధవారం 2,646 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో 747 పాజిటివ్ కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో న‌మోద‌యిన‌ట్లు ఆరోగ్య‌శాఖ‌ తాజా హెల్త్ బులిటెన్‌లో వెల్ల‌డించింది. గ‌డిచిన 24 గంట‌ల్లో మూడు కోవిడ్ మరణాలను న‌మోద‌యిన‌ట్లు తెలిపారు. దీంతో తెలంగాణ‌లో మొత్తం మరణాల సంఖ్య 4,094కు చేరుకుంది. తెలంగాణలో బుధవారం నాటికి 34,665 యాక్టివ్ కేసులు ఉన్న‌ట్లు బులిటెన్‌లో పేర్కొన్నారు. హైదరాబాద్‌తో పాటు.. తెలంగాణలోని ఇతర పట్టణ కేంద్రాలలో ఓమిక్రాన్-ఆధారిత కోవిడ్ ఇన్‌ఫెక్షన్లు గణనీయంగా పెరుగుతున్నాయి.

తాజాగా.. మేడ్చల్-మల్కాజ్‌గిరిలో 177, రంగారెడ్డి జిల్లాలో 134, హనుమకొండలో 114, కరీంనగర్‌లో 102, నల్గొండలో 86, సిద్దిపేటలో 87 కేసులు, ఖమ్మం నుండి 81 కేసులు నమోదయ్యాయని అధికారులు పేర్కొన్నారు. ఆరోగ్య శాఖ బుధవారం 88, 206 కోవిడ్ పరీక్షలను నిర్వహించింది. వాటిలో 2,452 నమూనాల ఫలితాలు రావాల్సివుంది. బుధవారం ఒక్క‌రోజే 3,603 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు.. రాష్ట్రంలో మొత్తం 3,23,02,160 కోవిడ్ -19 పరీక్షలు నిర్వహించారు. వాటిలో 7,69,407 పాజిటివ్‌గా పరీక్షించబడ‌గా.. 7,30,648 మంది కోలుకున్నారు.


Next Story