తెలంగాణలో కొత్త‌గా ఎన్ని క‌రోనా కేసులంటే..

255 New Corona Cases Reported In Telangana. తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్

By Medi Samrat
Published on : 18 Sept 2021 8:34 PM IST

తెలంగాణలో కొత్త‌గా ఎన్ని క‌రోనా కేసులంటే..

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 52,244 శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 255 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ శ‌నివారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 6,63,282కి చేరింది. నిన్న క‌రోనాతో ఒక్క‌రు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి.. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 3,903కి పెరిగింది. నిన్న 329 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 6,54,230కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 5,148 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రికవరీ రేటు 98.63 శాతం కాగా.. మరణాల రేటు 0.58 శాతంగా ఉన్నట్లు తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 70 కేసులు నమోదయ్యాయి.



Next Story