తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 87,110 శాంపిళ్లను పరీక్షించగా.. 2,524 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 5,78,351కి చేరింది. నిన్న ఒక్క రోజే 18 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి.. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,281కి పెరిగింది.
నిన్న 3,464 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 5,40,986కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 34,084 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 307 కేసులు నమోదు అయ్యాయి. నల్లగొండ జిల్లాలో 183, రంగారెడ్డి జిల్లాలో 142, ఖమ్మం జిల్లాలో 134, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 128 చొప్పున పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.