హైదరాబాద్‌లోని నాగోల్‌లో విషాదం చోటు చేసుకుంది. 25 ఏళ్ల యువకుడు షటిల్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఏం జరిగిందో తెలియక తోటి స్నేహితులు దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చి లేపే ప్రయత్నం చేశారు.. అప్పటికే.. అతను స్పృహ కోల్పోయాడు.. వెంటనే..స్నేహితులు దగ్గర్లో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
కాగా చనిపోయిన రాకేష్ ఖమ్మం జిల్లా తల్లాడ మండల మాజీ ఉపసర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు కుమారుడు. సిటీలోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. చేతికి వచ్చిన కుమారుడు ఇలా మృతి చెందడంతో తల్లిదండ్రులు, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.