తెలంగాణ‌లో కొత్త‌గా 2,493 క‌రోనా కేసులు.. ఎన్ని మ‌ర‌ణాలంటే..

2493 New Corona Cases Reported In Telangana. తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 94,189

By Medi Samrat  Published on  1 Jun 2021 2:25 PM GMT
తెలంగాణ‌లో కొత్త‌గా 2,493 క‌రోనా కేసులు.. ఎన్ని మ‌ర‌ణాలంటే..

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 94,189 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 2,493 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 5,80,844కి చేరింది. నిన్న ఒక్క రోజే 15 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి.. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 3,296కి పెరిగింది.

నిన్న 3,308 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 5,44,294కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 33,254 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్త‌గా న‌మోదైన కేసుల్లో అత్య‌ధికంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో 318 కేసులు న‌మోదు అయ్యాయి. న‌ల్ల‌గొండ జిల్లాలో 165, రంగారెడ్డి జిల్లాలో 152, ఖ‌మ్మం జిల్లాలో 121, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో 115 చొప్పున పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.

Next Story
Share it