తెలంగాణ‌లో భారీగా త‌గ్గిన క‌రోనా కేసులు

245 New Corona Cases Reported In Telangana. తెలంగాణ‌లో నిన్న‌టితో పోల్చితే క‌రోనా కేసుల సంఖ్య భారీగా త‌గ్గింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 50,126

By Medi Samrat  Published on  15 Aug 2021 3:10 PM GMT
తెలంగాణ‌లో భారీగా త‌గ్గిన క‌రోనా కేసులు

తెలంగాణ‌లో నిన్న‌టితో పోల్చితే క‌రోనా కేసుల సంఖ్య భారీగా త‌గ్గింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 50,126 శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 245 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ఆదివారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 6,52,380కి చేరింది. నిన్న క‌రోనాతో ఒక్క‌రు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి.. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 3,842కి పెరిగింది. నిన్న 582 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 6,41,270కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 7,268 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రికవరీ రేటు 98.29 శాతం కాగా.. మరణాల రేటు 0.58 శాతంగా ఉన్నట్లు పేర్కొంది.



Next Story