తెలంగాణ హెల్త్ బులిటెన్‌.. కొత్త‌గా ఎన్ని కేసులంటే..

2384 New Corona Cases Reported In Telangana. తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో

By Medi Samrat  Published on  2 Jun 2021 4:23 PM GMT
తెలంగాణ హెల్త్ బులిటెన్‌.. కొత్త‌గా ఎన్ని కేసులంటే..

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 1,08,696 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 2,384 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 5,83,228కి చేరింది. నిన్న ఒక్క రోజే 17 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి.. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 3,313కి పెరిగింది.

నిన్న 2,242 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 5,46,536కి చేరింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 33,379 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్త‌గా న‌మోదైన కేసుల్లో అత్య‌ధికంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో 3307 కేసులు న‌మోదు అయ్యాయి. న‌ల్ల‌గొండ జిల్లాలో 170, రంగారెడ్డి జిల్లాలో 135, ఖ‌మ్మం జిల్లాలో 167, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో 113 చొప్పున పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.


Next Story